విధాత:హైదరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మారిన హైదరాబాద్‌లో ఈ టెస్టింగ్ సెంటర్ అత్యవసరమని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నగరంలో టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే నెలకి సుమారు 8నుంచి 10 కోట్ల డోసులను అదనంగా ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే రానున్న ఆరు నెలల్లో హైదరాబాద్ నుంచి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్ సరఫరా ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని.. అవసరమైన భూమిని జినోమ్ వ్యాలీలో అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ చెప్పారు.
Readmore:24 గంటల్లో 1,82,523 మందికి టీకా