Hyderabad Metro | ఎయిర్​పోర్ట్​ మెట్రో ‌‌– ముచ్చటగా మూడు రకాల ప్రయాణం

ఎయిర్​పోర్ట్​ మెట్రో ‌‌– ముచ్చటగా మూడు రకాల ప్రయాణం ..మెట్రో కారిడార్లన్నీ కూడా ఆకాశ(ఎలివేటెడ్‌ Elevated) మార్గాల్లోనే ఉన్నాయి. కానీ, ఈ ఎయిర్ పోర్ట్ మెట్రో మాత్రం  ముచ్చటగా మూడు రకాల మార్గాలతో ప్రయాణీకులకు థ్రిల్​ను పంచే అవకాశముంది. ఈ మార్గం కొంత దూరం ఆకాశంలో(Elevated), మరికొంత దూరం భూమ్మీద(Surface), ఇంకొంత దూరం భూగర్భం(Underground Tunnel)లో ప్రయాణించే విధంగా ఉంటుంది

హైదరాబాద్​ నగరం ట్రాఫిక్​ పనితీరుతో బెంగళూరును దాటేందుకు శతవిధాల కృషిచేస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని రకాల రవాణా మార్గాలున్నా, రోడ్ల మీదకు కార్లు, వ్యక్తిగత వాహనాల రాక ఆగడంలేదు. ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ జామ్​లను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది. ఇంకా మెట్రో రైళ్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది గానీ, లేకపోతే, పిల్లలు స్కూళ్లలోనూ, పెద్దలు ఆఫీసుల్లోనే మకాం పెట్టాల్సివచ్చేది. అందుకే మరికొన్ని మెట్రో రూట్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఉన్న మూడు మెట్రో కారిడార్లకు అదనంగా మరో కారిడార్​ రాబోతోంది. అదే ఎయిర్​పోర్ట్​ కారిడార్​.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఈ మెట్రో (Hyderabad Metro aRail Services) సేవలు ప్రధాన రవాణాగా మారిపోయింది. పైగా తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా నగరంలో ఏ ప్రాంతానికైనా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ఆఫీసులకు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లవలసిన పిన్నలు, పెద్దలు ఈ మెట్రో ప్రయాణం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇలా ప్రతినిత్యం దాదాపుగా 6 లక్షల(6 Lakh) మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే ఎల్బీనగర్- మియాపూర్(29 km), నాగోల్- రాయదుర్గ్(28 km) , జేబీఎస్​–ఫలక్​నుమా(15 km) కారిడార్‌లలో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అలాగే నగరంలో పలు కొత్త మార్గాల్లో కూడా ప్రభుత్వం ఈ మెట్రోను సేవలను విస్తరించనుంది. గత బిఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు మార్గాలు, నాగోల్​ నుండి పెద్ద​అంబర్​పేట్(Nagole – Peddaamberpet)​, జేబీఎస్​ నుండి షామిర్​పేట్​(JBS – Shameerpet), ఉప్పల్​ నుండి యాదాద్రి(Uppal – Yadadri), రాయదుర్గం నుండి ఎయిర్​పోర్ట్​(Raydurg – Airport).  అందులో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రో ప్రభుత్వానికి, ప్రజలకు చాలా ముఖ్యమైన మార్గం. అయితే బిఆర్ఎస్​ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం–ఎయిర్​పోర్ట్​ మార్గాన్ని ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం దారి మళ్లించి ఎల్​బీ నగర్​ – ఎయిర్​పోర్టు(LB Nager – Airport)గా మార్చింది.

ప్రస్తుతం నగరంలో రాయదుర్గం నుంచి నాగోల్‌ వరకు (28 కిమీ) ఓ మెట్రో రైలు మార్గం ఉంది. దీన్ని ఎల్​బీ నగర్ వరకు పొడిగించి, అక్కన్నుంచి కొత్త మార్గంగా ఎల్బీనగర్- చాంద్రాయణగుట్ట- మైలార్‌దేవ్‌పల్లి- జల్‌పల్లి- పీ7 రోడ్- రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్‌పోర్టు (LB Nagar-Chadraya gutta-Mylardevpally-Jalpally-P7 Road-RGIA)వరకు మెుత్తంగా 33.1 కి.మీ. మేరకు నిర్మించనున్నారు. అయితే ఈ రూట్​లో కొన్ని ఆసక్తికరమైన ప్రత్యేకతలున్నట్లు తెలిసింది.

ఇప్పటి వరకు నగరంలో మెట్రో కారిడార్లన్నీ కూడా ఆకాశ(ఎలివేటెడ్‌ Elevated) మార్గాల్లోనే ఉన్నాయి. కానీ, ఈ ఎయిర్ పోర్ట్ మెట్రో మాత్రం  ముచ్చటగా మూడు రకాల మార్గాలతో ప్రయాణీకులకు థ్రిల్​ను పంచే అవకాశముంది. ఈ మార్గం కొంత దూరం ఆకాశంలో(Elevated), మరికొంత దూరం భూమ్మీద(Surface), ఇంకొంత దూరం భూగర్భం(Underground Tunnel)లో ప్రయాణించే విధంగా ఉంటుంది. దీనికి సంబంధించిన డిపీఆర్​ (DPR) తయారైంది. ఇక ప్రభుత్వ అనుమతులే ఆలస్యం. ఎలివేటెడ్​ కారిడార్​ కాకుండా మిగతా రెండు మార్గాలు తెలంగాణలో ఇదే మొదటిసారి.  డిపీఆర్​లో పొందుపరిచిన డిజైన్ ను పరిశీలిస్తే ఈ మూడు సెక్షన్లు కింద తెలిపిన విధంగా తయారుకాబోతున్నాయి.

    1. నాగోల్‌ నుంచి లక్ష్మీగూడ (Nagole-Laxmiguda)వరకు మెుత్తం4 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ (ఆకాశమార్గం) ఉంటుంది.
    2. లక్ష్మీగూడ నుంచి పీ7 రోడ్డు, ఎయిర్‌పోర్టు ప్రాంగణం సరిహద్దు(Laxmiguda to Airport border via P7 Road) వరకు28 కి.మీ దూరం భూ మార్గాన్ని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం తగ్గించేందుకు మెట్రోను భూమార్గంలోనే “ఎట్​-గ్రేడ్​” (At-Grade)పద్ధతిలో డిజైన్​ చేయాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో, ఆ కొద్దిదూరాన్ని ఎట్-గ్రేడ్​గా  మార్చారు. ఇక్కడ ఎట్​-గ్రేడ్​ మార్గమంటే ఏంటో తెలుసుకుందాం. ఎట్​- గ్రేడ్​ (At-Grade)మార్గం సాధారణ రోడ్డు (Regular Road)మీదే ఉంటుంది. రోడ్డు మీదే పట్టాలు వేస్తారు. రోడ్డు మీద వెళ్లే వాహనాలతో పాటే రైలు కూడా వెళ్తుంటుంది. ట్రాఫిక్​ సిగ్నల్​ పడితే ఆగుతుంది. ఈ రకమైన మార్గంలో స్టేషన్​ Roof-less Station)ఎటువంటి పైకప్పు లేకుండా మామూలు బస్​స్టాప్​లాగే ఉంటుంది. పక్కన టికెట్​ వెండింగ్​ మెషిన్​ (Ticket Vending Machine)ఒకటి పెడతారు. అంతే. సాధారణ భూమార్గపు మెట్రో అంటే, ప్రత్యేకమైన రూట్,  ట్రాక్​ ఉంటాయి  ఇప్పటి మన రైళ్లలాగా. రోడ్డుతో ఎటువంటి సంబంధం ఉండదు.

  1. ఇక ఈ ఎయిర్‌పోర్ట్ ప్రాంత సరిహద్దు నుంచి టెర్మినళ్ల (Airport Border – Terminals) వరకు42 కి.మీ దూరం భూగర్భంలో (టన్నెల్ – Underground Tunnel) మెట్రో ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు.

ఎయిర్​పోర్ట్​ ప్రాంగణంలో మూడు స్టేషన్ల(3 Stations in Airport Area)ను ప్రతిపాదించారు.  ఒకటి టర్మినల్​ స్టేషన్​(Terminal Station) ప్రయాణీకులకోసం, ఇంకోటి సరుకు రవాణాకు  కార్గో స్టేషన్(Crgo Station)​, మరొకటి ఏరోసిటీ  స్టేషన్​(Aero city Station)గా నిర్మించడంతో  పాటు  మెట్రో డిపోని కూడా నిర్మించాలని ప్రతిపాదించారు.  నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు సగటున ప్రతి 1.5 కి.మీ దూరానికి ఒకటి చొప్పున మొత్తం 22 మెట్రో స్టేషన్లు (22 Stations) ఉంటాయి. వీటిలో కొన్నింటిని ఫ్యూచర్‌ స్టేషన్లుగా,  భవిష్యత్తు అవసరాల కోసం మెట్రో అధికారులు ప్రతిపాదించారు.

ఈ మార్గం అందుబాటులోకి వస్తే, కొంతలో కొంత ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశముంటుంది. అలాగనే మనం ఆశించాలి.