విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో వెయిటింగ్ కష్టాలు తీరనున్నాయి. రైళ్ల రాక కోసం ఫ్లాట్ ఫామ్ లపై ఒక్కోసారి 5నుంచి 10నిమిషాల పాటు ఎదురుచూస్తున్న ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు మెట్రో యజమాన్యం కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం పీక్ ఆవర్స్‌లో 5 నిమిషాలకు, రద్దీ లేని సమయంలో 10-12 నిమిషాలకు ఒక రైలు నడుస్తుండగా, ఇకపై 2 నిమిషాలకో రైలు అందుబాటులోకి రానుంది.
పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా, ప్రస్తుతం ఉన్న మూడు కోచ్‌ల రైళ్లకు బదులుగా బిజీ రూట్లలో నాలుగు, ఆరు కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) పరిశీలిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధి విధానాలను మెట్రో సంస్థ వెల్లడించనుంది.
