హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విధాత) : హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ డైరెక్టర్ ఎన్వీఎస్.రెడ్డిని బదిలీ చేసి ఆయన స్థానంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ (2009 ఐఏఎస్ బ్యాచ్) ను పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. రవాణ రంగంలో ఆయన సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం పట్టణ రవాణా సలహాదారుడిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లి వచ్చిన శృతి ఓజా (2013 ఐఏఎస్ బ్యాచ్) ను మహిళా, శిశు అభివృద్ధి సంచాలకురాలిగా నియమించారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య (2014 ఐఏఎస్ బ్యాచ్) కు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ సొసైటీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ కోట శ్రీవత్స (2017 ఐఏఎస్ బ్యాచ్)కు హెచ్ఎండీఎ (జనరల్) జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా, కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లో డెప్యుటేషన్ పై పనిచేస్తున్న సహకార శాఖ జాయింట్ రిజిస్ట్రార్ ఎం.రాజిరెడ్డిని హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ గా, అదిలాబాద్ జిల్లా పరిషత్ సీఈఓ జీ.జితేందర్ రెడ్డి ని టీజీ ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా, ఆర్. ఉపేందర్ రెడ్డిని హెచ్ఎండీఏ (సబ్ అర్భన్ రీజియన్) జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా, టీ. వెంకన్న ను హెచ్ఎండీఏ (కోర్ అర్భన్ రీజియన్ అండ్ మెట్రో రైల్) జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా నియమించారు