వరంగల్: ములుగు అభివృద్ధికి కలిసి పనిచేద్దాం: ఎమ్మెల్యే సీతక్క

పెండింగ్ రోడ్లు, బిల్డింగ్‌ పనులను పూర్తి చేయాలి నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలి విధాత, వరంగల్: వెనుకబడిన ములుగు నియోజక వర్గ అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధిలు సమిష్టిగా పని చేసి అభివృద్ధికి బాటలు వేయాలని ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క కోరారు. మంగళవారం ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్ అండ్ బి, పి.ఆర్, ఐబి ఐటిడిఏ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు ప్రాంతం […]

  • Publish Date - December 20, 2022 / 01:02 PM IST
  • పెండింగ్ రోడ్లు, బిల్డింగ్‌ పనులను పూర్తి చేయాలి
  • నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలి

విధాత, వరంగల్: వెనుకబడిన ములుగు నియోజక వర్గ అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధిలు సమిష్టిగా పని చేసి అభివృద్ధికి బాటలు వేయాలని ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క కోరారు. మంగళవారం ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్ అండ్ బి, పి.ఆర్, ఐబి ఐటిడిఏ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు ప్రాంతం లో ఇప్పటి వరకు మంజూరైన పనులు, కొత్తగా వచ్చిన అభివృద్ధి పనుల పై ప్రతీ నెలకోసారి పనుల పురోగతి పై సమీక్ష చేసుకుందామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు లేక కనీస బస్ సౌకర్యం కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అధికారులు ఎప్పటికప్పుడు పనుల పై నిఘా పెంచి సకాలంలో పనులు పూర్తి చేసే విధంగా చూడాలని కోరారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని, ముఖ్యంగా బ్రిడ్జి ల నిర్మాణ పనులను త్వ‌ర‌గా పూర్తి చేయాలి సూచించారు. వర్షాకాలం లో గ్రామాల మధ్య రాక పోకలు లేక అవస్థలు పడుతున్నారని నిర్మాణ పనులను జాప్యం చేస్తున్నకాంట్రాక్టర్లకు నోటీస్ లు ఇవ్వాలని చెప్పారు.

టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చెయ్యకుండా ఉన్న పనులకు నూతన టెండర్ ప్రక్రియ చేసి పనులు ప్రారంభించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీతక్క అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్అండ్ బి, పి.ఆర్, ఐబి, ఐటిడిఏ ఈఈ, డీఈ, ఏఈ ఇతర అధికారులు పాల్గొన్నారు.