Site icon vidhaatha

Malla Reddy | మ‌నుమరాలి సంగీత్‌లో.. డీజే టిల్లు పాట‌కు మాస్ మ‌ల్ల‌న్న‌ స్టెప్పులు అదుర్స్.. వీడియో

Malla Reddy | మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి( Malla Reddy ).. ఈ పేరు వింటేనే శ‌రీరంలో ఏదో తెలియ‌ని ఊపు వ‌స్తోంది.. ఓ జోష్ వ‌స్తోంది.. ఎందుకంటే.. మ‌ల్ల‌న్న మాట‌లు.. చేత‌లు ఆ విధంగా ఉంటాయి. ఇలా ఆయ‌న ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా( Social Media ) స్టార్‌గా మారారు. మ‌ల్ల‌న్న డైలాగులు( Mallanna Dailogues ) ఎక్క‌డంటే ఎక్క‌డ వినిపిస్తాయి. తాజాగా త‌న మ‌నుమ‌రాలు సంగీత్ ఫంక్ష‌న్‌లో మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి చిందులేసి హుషారెత్తించారు. మాస్ పాట‌కు మ‌ల్ల‌న్న స్టెప్పులేసి డ్యాన్స్ ఇర‌గ‌దీసి.. యూత్‌లో జోష్ నింపారు. ఏకంగా మూడు నిమిషాల పాటు డ్యాన్స‌ర్ల‌కు మించి.. త‌న మాస్ స్టెప్పుల‌తో అంద‌ర్నీ అల‌రించారు.

నిన్న రాత్రి జ‌రిగిన సంగీత్ ఫంక్ష‌న్‌( Sangeeth Function )లో.. మంచి కాస్ట్యూమ్స్‌తో, మ‌న‌వ‌ళ్ల‌ను ప‌క్క‌న పెట్టుకుని, క‌ళ్ల‌కు అద్దాలు జోడించి.. త‌న‌దైన స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టారు. ఇక డీజే టిల్లు పాట‌( DJ Tillu Song )కు పొలిటిక‌ల్ మ‌ల్లు స్టెప్పులు అదిరిపోయాయి. ఈ డ్యాన్స్ కోసం మ‌ల్ల‌న్న ప్ర‌త్యేకంగా కొరియోగాఫ‌ర్ల‌తో శిక్ష‌ణ తీసుకున్నాడ‌ట‌. స్టేజీపైకి ఆయ‌న ఎంట్రీ కూడా ఓ రేంజ్‌లో ఏర్పాటు చేశారు. మ‌ల్ల‌న్న డ్రెస్ కూడా పాట‌కు త‌గ్గ‌ట్టుగా అదిరిపోయింది. ఈ నెల 27న మ‌ల్లారెడ్డి మ‌నుమ‌రాలు, మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మ‌ర్రి రాజశేఖ‌ర్ రెడ్డి కూతురు వివాహం జ‌ర‌గ‌నుంది.

 

Exit mobile version