డీజీపీ ఎదుట మావోయిస్టు శారదక్క లొంగుబాటు
విధాత: మావోయిస్టు నేత బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారదక్క.. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. శారదక్క స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం. 1994లో పీపుల్స్ వార్ పార్టీకి ఆమె ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లారు. శారదక్క.. ఇటీవల కరోనాతో మృతిచెందిన హరిభూషణ్ భార్య. ఆమె లొంగుబాటుపై డీజీపీ మహేందర్రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు మీడియా […]

విధాత: మావోయిస్టు నేత బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారదక్క.. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. శారదక్క స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం. 1994లో పీపుల్స్ వార్ పార్టీకి ఆమె ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లారు. శారదక్క.. ఇటీవల కరోనాతో మృతిచెందిన హరిభూషణ్ భార్య. ఆమె లొంగుబాటుపై డీజీపీ మహేందర్రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.