విధాత: తెలంగాణ మీడియా అకాడమీ చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి ఇటీవల మరణించిన 34 జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం మీడియా అకాడమీ అందిస్తుందని అకాడమీ చైర్మన్ కే .శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ఆరు నెలల వ్యవధిలోని ఈ జర్నలిస్టులు చనిపోయారని అన్నారు .వీరి కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం తో పాటు చనిపోయిన జర్నలిస్టుల భార్యలకు నెలకు 3000 రూపాయలు పెన్షన్ అకాడమీ ఇస్తుందని, ఇది ఐదు సంవత్సరాల పాటు అందజేస్తామని అన్నారు. పెన్షన్ తో పాటు వారి పిల్లలకు ఎల్ కేజీ నుండి పదవ తరగతి వరకు చదువుకోవడానికి నెలకు 1000 రూపాయల అందజేస్తామన్నారు.
ప్రాణాంతకర వ్యాధులతో బాధపడుతూ ప్రమాదానికి గురైన జర్నలిస్టులకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని శ్రీ కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు పరిశీలించిన దరఖాస్తులలో క్యాన్సర్ తో బాధపడుతున్న జర్నలిస్ట్ గురు ప్రసాద్ ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న బండి నారాయణకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మంజూరు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. వీరితోపాటు మరో ఇద్దరూ జర్నలిస్టులకు 50 వేల రూపాయలు మంజూరు చేసినట్ల వెల్లడించారు. ఈ సమావేశంలో శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్, మీడియా అకాడమీ సెక్రెటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, మేనేజర్ పిసి వెంకటేశం, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.
చనిపోయిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన … మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ మీడియా అకాడమీ చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి ఇటీవల మరణించిన 34 జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం మీడియా అకాడమీ అందిస్తుందని అకాడమీ చైర్మన్ కే .శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

Latest News
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి
కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కపోయిన వాహనాలు
13వ వారం ఊహించని ఎలిమినేషన్…
ఇండిగో బాధిత ప్రయాణికులకు రైల్వే, ఆర్టీసీ బాసట!
ఎడారి పాము ఎత్తులు ఎన్నో..క్షణాల్లో ఇసుకలోకి!
కొత్త బిజినెస్లో ఆ హీరో సెన్సేషన్
ప్రపంచంలోనే పొడవైన ఎయిర్ రూట్ ప్రారంభం!
ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..