వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి: DMHO చందు నాయక్

రామాయంపేట ఆసుపత్రికి త్వరలో డాక్టర్ల నియామకం.. విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చందు నాయక్ కోరారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చందు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న‌ సమస్యలను ఆయన పరిశీలించారు. […]

  • Publish Date - December 20, 2022 / 11:01 AM IST
  • రామాయంపేట ఆసుపత్రికి త్వరలో డాక్టర్ల నియామకం..

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చందు నాయక్ కోరారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చందు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న‌ సమస్యలను ఆయన పరిశీలించారు. త్వరలోనే రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త డాక్టర్లను మంజూరు చేస్తామన్నారు. గైనకాలజిస్ట్, అనస్థీషియా, పీడియాట్రిషన్ డాక్టర్లు త్వరలోనే అందుబాటులోకి వస్తారని ఆయన తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య రోజురోజుకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ చందు నాయక్ తెలిపారు జిల్లా కేంద్రంలో 57 రకాల రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నంవున‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడైనా శాంపిల్ ఇచ్చి రిపోర్ట్ పొందవచ్చని ప్రజలకు సూచించారు.

ప్రైవేట్ ఆస్పత్రులలో ర‌క్త పరీక్షలు రాస్తే డబ్బు ఖర్చు చేయకుండా ఆ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం రెండు గంటల లోపు వైద్య పరీక్షలకు నమూనాలు ఇస్తే సాయంత్రం 6 గంటల లోపు ఆన్లైన్లో పరీక్షల ఫలితాలు ఇస్తామన్నారు.

కార్యక్రమంలో రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుకేషిని, డాక్టర్ ప్రదీప్ రావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.