శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి 6 కేజీల బంగారం బహుకరించనున్న MEIL

విధాత‌: తెలంగాణలోని ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ఆరు కేజీల బంగారం సమర్పిస్తున్నట్టు బుధవారం నాడు ప్రకటించింది. ఈ సందర్భంగా MEIL డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం ఎంతో పుణ్య కార్యక్రమమని, ఇందులో […]

  • Publish Date - October 20, 2021 / 10:30 AM IST

విధాత‌: తెలంగాణలోని ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ఆరు కేజీల బంగారం సమర్పిస్తున్నట్టు బుధవారం నాడు ప్రకటించింది.

ఈ సందర్భంగా MEIL డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం ఎంతో పుణ్య కార్యక్రమమని, ఇందులో మేం పాలుపంచుకోవడం మాకు ఎంతో గౌరవప్రదమైన అవకాశమని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తామని అన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, పుణ్యస్థలమైన యాదాద్రి ముఖ్యమంత్రి ఆలోచనాత్మక రూపకల్పనలో మరింత అందంగా రూపుదిద్దుకుని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని తెలిపారు.