Asaduddin Owaisi | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీ.నవీన్ యాదవ్ కు తమ పార్టీ మద్ధతు ఇస్తున్నదని, అందుకే అభ్యర్థిని బరిలో నిల్చోబెట్టలేని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలవడం మూలంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు కాదని, పాత ప్రభుత్వం కూలిపోదని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు నియోకవర్గ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థికి అవకాశం ఇచ్చారని, కాని ఎక్కడా అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు.
వార్డులలో ఎక్కడా కూడా ఆ ఛాయలు కన్పించడం లేదని, ఓటర్లు అభివృద్ధి చేసే వారికే ఈసారి ఓటు వేస్తారన్నారు. కావున యువకుడు అయిన నవీన్ యాదవ్ కు ఓట్లు వేసి గెలిపించాలని అసదుద్దీన్ ఓటర్లను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడేళ్లు అధికారంలో ఉంటుందని, ఈ ఎన్నికల మూలంగా ప్రభుత్వంలో మార్పులు ఉండవనే ఉద్ధేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 2028 లో జరిగే అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటారని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.