Ponnam Prabhaker | ప్రజా ప్రభుత్వంలోనే అమరులకు గుర్తింపు ..ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటును అవమానించారు

తెలంగాణ ఏర్పడిన పదేళ్లు నియంతృత్వ పాలనలో మ్రగ్గిందని, తొలిసారిగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకల్లో అమరవీరులను స్మరిస్తూ ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు

  • Publish Date - June 1, 2024 / 05:14 PM IST

విధాత : తెలంగాణ ఏర్పడిన పదేళ్లు నియంతృత్వ పాలనలో మ్రగ్గిందని, తొలిసారిగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకల్లో అమరవీరులను స్మరిస్తూ ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా వేడుకలకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వేడుకలకు సోనియా గాంధీ వస్తారని ఆశిస్తున్నామన్నారు. రాజకీయ విమర్శలకు తావు లేకుండా దశాబ్ది వేడుకలు జరుపుకోవాలన్నారు.

ఆత్మగౌరవం కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణ గీతం ఉండాలన్న ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రావిర్భావ వేడుకల్లో తెలంగాణ అధికారిక గీతం విడుదల చేయబోతున్నామన్నారు. అలాగే రాష్ట్రం చిహ్నంలో కూడా మార్పులుంటాయని, దీనిపై రాద్ధాంతం చేస్తున్న బీఆరెస్ గతంలో రాష్ట్ర చిహ్నం ఏర్పాటులో ఎవరి అభిప్రాయం తీసుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వం తెలంగాణ వేడుకలకు కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు. ప్రధాని మోదీ ఎన్నోసార్లు తెలంగాణ ఏర్పాటును అవమానించారన్నారు. తల్లిని చంపి బిడ్డను తెచ్చుకున్నారని విమర్శలు చేశారని పొన్నం గుర్తు చేశారు. అయితే తెలంగాణ సాధనలో బీజేపీ దివంగత నేత సుష్మస్వరాజ్ సేవలు విస్మరించలేనివన్నారు.

Latest News