Site icon vidhaatha

మెడికల్‌ సిటీగా వరంగల్‌ అభివృద్ధి : మంత్రి దయాకర్‌రావు


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్, టైప్-1, 2 మధుమేహ ప్రత్యేక క్లినిక్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు శనివారం ప్రారంభించారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ హాజరయ్యారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.10.60 కోట్లతో ఏర్పాటుచేసిన ఈ న్యూన్ అత్యాధునిక రహిత ఎంఆర్ఐ హీలియం స్కానింగ్ కేంద్రం దక్షిణ భారత దేశంలో మొదటిదని, మన దేశంలోనే మూడో కేంద్రమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పడకల దగ్గర నుంచి మెడిసిన్, ఆసుపత్రుల వసతులు, వైద్యంతో పాటు వైద్య విద్య, మెడికల్ కాలేజీల సీట్లు ఇలా ఒక్కటి కాదు వైద్యరంగంలో అన్ని రకాల అభివృద్ధి సాధించి తెలంగాణ దేశానికే మోడల్ గా నిలిచిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రామ తేజస్విని, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆర్ఎంఓ హరీష్ రావు, వైద్యులు పాల్గొన్నారు.

Exit mobile version