విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి వచ్చే కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని శనివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని ఆయన సందర్శించి
చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన వైద్య సేవలు అందుతున్న తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆర్టీసీ ఆసుపత్రి ద్వారా కార్మికులు కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందులో భాగంగా అవసరమైన వైద్య పరీక్షల వసతులను కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
Ponnam Prabhakar | మెరుగైన వైద్య సేవలందించాలి … ఆర్టీసీ ఆసుపత్రి వైద్యులతో మంత్రి పొన్నం
హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి వచ్చే కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Latest News
బ్లాక్ సూట్ లో నడుము అందాలు చూపిస్తున్న అక్కినేని కోడలు శోభిత
చీరకట్టులో టాలెంట్ చూపిస్తున్న అనసూయ భరధ్వాజ్
యూకే వీసా నిబంధనలు కఠినతరం: భారతీయ హెల్త్‌కేర్, ఐటీ ఉద్యోగాలకు భారీ దెబ్బ
అదనపు కట్నం అడిగారని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు.. యూపీలో ఘటన (Viral Videos)
తెలంగాణను తాకుతూ వెళ్లే సూరత్–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే పొడవు కుదింపు..
అంతరిక్షంలో బార్ అండ్ రెస్టారెంట్.. ఎప్పుడు? ఎలా వెళ్లాలి?
ఉపాధి హామీలో ‘గాంధీ’ పేరు తొలగింపు.. ‘రామ్ జీ’ అక్షరాల చేరిక!
ఈ వారం ఓటీటీలో వినోద విందు..
హిమాలయాల్లో పొంచి ఉన్న అణు ముప్పు!
200 సినిమాల చెట్టు మళ్లీ చిగురించింది..