Chennai Surat Highway | చెన్నై–సూరత్ నగరాలను కలుపుతూ ఆరు లేన్ల నేషనల్ హైవేను కేంద్ర ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిని భారత్ మాల పరియోజన కింద రోడ్డు రవాణా, హైవేల శాఖ చేపట్టనున్నది. అయితే.. ముందుగా అనుకున్న విధంగా కాకుండా దీనిలో మార్పులు చేయనున్నారని తెలుస్తున్నది. తొలుత దీనిని సూరత్ వరకూ అనుకున్నా.. నాశిక్‌తో నిలిపివేయనున్నారని సమాచారం. సూరత్, నాశిక్ మధ్య భూ సేకరణ విషయంలో తీవ్ర సవాళ్లు, పర్యావరణ క్లియరెన్స్‌ల ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.
- తొలుత ఈ ఎక్స్‌ప్రెస్ హైవేను సూరత్ నుంచి చెన్నై వరకూ 1,271 కిలోమీటర్ల పొడవున ప్లాన్ చేశారు.
- దీనికి 50వేల కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేశారు.
- సవరించిన ప్రణాళిక ప్రకారం.. ఈ రోడ్డు పొడవులో 900 కిలోమీటర్లు తగ్గించనున్నారు.
- అంటే.. నాశిక్ వరకు మాత్రమే ఈ ఎక్స్‌ప్రెస్ హైవే ఉంటుంది.
మొదట అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈ రహదారి.. సూరత్, నాశిక్, అహ్మద్‌నగర్, సోలాపూర్, కలబురగి, కర్నూల్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, కడప, తిరుపతి మీదుగా వెళ్లాల్సి ఉంది. ఇది గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానం చేస్తుంది.
కొత్త ప్రణాళిక ప్రకారం..ఎన్‌హెచ్ 48 ముంబై–అహ్మదాబాద్ హైవేలోని భార్వీర్ ఖుర్ద్ నుంచి తవా గ్రామం వరకూ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను మహారాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ నిర్మిస్తుంది. చెన్నై–సూరత్ ఎక్స్‌ప్రెస్ వే లోని సూరత్–నాశిక్ భాగం ప్రయోజనాలను ఇది ఎక్కువగా అందిస్తుందని భావిస్తున్నారు.
వాస్తవానికి ఈ ప్రాజెక్టును రెండు సెక్షన్స్‌గా విడగొట్టారు. తొలి భాగంలో 513 కిలోమీటర్లు ఉంటుంది. ఇది సూరత్ నుంచి సోలాపర్ వరకు. రెండో భాగంలో సోలాపూర్ నుంచి చెన్నై వరకు మరో 707 కిలోమీటర్లు ఉంటుంది. నాశిక్ వరకే పరిమితం చేసినా.. దీని అసలు లక్ష్యంలో ఎలాంటి మార్పులు ఉండబోవని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదిత ఈ ఆరు లేన్ల రహదారిపై వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో ప్రయాణించవచ్చు. తద్వారా ఇది మధ్య భారత్, దక్షిణ భారత్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.
Read Also |
Voyager Station | అంతరిక్షంలో బార్ అండ్ రెస్టారెంట్.. ఎప్పుడు? ఎలా వెళ్లాలి?
G Ram G To Replace MGNREGA : ఉపాధి హామీలో ‘గాంధీ’ పేరు తొలగింపు.. ‘రామ్ జీ’ అక్షరాల చేరిక!
CIA Lost nuclear device | హిమాలయాల్లో పొంచి ఉన్న అణు ముప్పు!
