Site icon vidhaatha

తెలంగాణ- మహారాష్ట్ర మధ్య నిలిచిపోయిన రాకపోకలు

telangana-maharashtra-transport-disruptions

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ- మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జుక్కల్ మండలం సోపూర్ సమీపంలో వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ- కర్ణాటక మధ్య కూడా రాకపోకలు ఆపివేశారు. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కౌలాస్ నాలాలోకి భారీగా వరద నీరు చేరుతోంది.కామారెడ్డిలో కురిసిన భారీ వర్షాలకు కౌసంపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారి దెబ్బతింది. దీంతో ఉత్తర- దక్షిణ కారిడార్ కు అంతరాయం ఏర్పడింది. ఈ రోడ్డు దెబ్బతినడంతో సరుకుల రవాణా చేస్తున్న వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. రోడ్డు నిర్మాణ పనులను అధికారులు చేపట్టారు. మరో వైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కుభీర్ మండలంలో చెరువులు, కుంటలు, వాగులు, పొంగిపొర్లుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లొని బెల్గాంతండా వద్ద లో లెవల్ వంతెన దెబ్బతిన్నది. దీంతో మహారాష్ట్ర, తెలంగాణకు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వాహనాలను దారి మళ్లించారు.

హైదరాబాద్-ఆదిలాబాద్ వెళ్తున్న సరుకు తరలింపు వాహనాలు, హెవీ వెహికిల్స్ ను మేడ్చల్ చెక్ పోస్టు వద్ద మళ్లించారు. మేడ్చల్- సిద్దిపేట- కరీంనగర్-జగిత్యాల-కోరుట్ల-మెట్ పల్లి-ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ వైపునకు వెళ్లాలని అధికారులు సూచించారు. సాధారణ ప్యాసింజర్లు, సరుకు రవాణాతో సంబంధం లేని వాహనాలను హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు తూప్రాన్ వద్ద మళ్లించారు.

Exit mobile version