– ఆటిజం, మేధో వైకల్యం వారికి ఉపయోగం
– వికలాంగుల మనసు గాయపరుచకూడదు
విధాత, వరంగల్ ప్రతినిధి:ఆటిజం, మేధో వైకల్యం, ఎదుగుదల లోపం ఉన్న పిల్లల కుటుంబాల ‘నయీ దిశా’ హెల్ప్ లైన్ ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. నయీ దిశా హెల్ప్ లైన్ ను శనివారం సచివాలయంలో మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూనయీ దిశా హెల్ప్ లైన్ ద్వారా దివ్యాంగుల పథకాలు, హక్కులు, ప్రయోజనాలను ఆన్లైన్ లో అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నయీ దిశా రిసోర్స్ సెంటర్ తో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. నయీ దిశా హెల్ప్ లైన్ ద్వారా థెరపిస్టులు, ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులు, పాఠశాలలు, ఆసుపత్రులు, వైద్యులు, ఇతర ఆటిజం పిల్లల తల్లిదండ్రులతో అనుసంధానం అయ్యే అవకాశం కలుగుతుందన్నారు. ఈ హెల్ప్ లైన్ ఆటిజం పిల్లలకు, పేరెంట్స్ కి ఒక వరమని చెప్పారు. రాజ్యాంగం దివ్యంగులకి, వారి కుటుంబాలకు కూడా హక్కులు కల్పిస్తుందన్నారు. ఆ హక్కుల పట్ల వారికి అవగాహన కల్పించడం అవసరమని అన్నారు. ఆటిజం చిన్నారుల టీచర్లకు కూడా ఆ హక్కుల పై అవగాహన వుండాలని వివరించారు. ఆటిజం సమస్య ను అధిగమించేందుకు నయీ దిశా హెల్ప్ లైన్ ఉపయోగపడుతుందన్నారు. ఆటిజం సమస్య కుటుంబ సమస్య కాదు, అది సమాజ, ప్రభుత్వ సమస్యగా అభివర్ణించారు. ఆటిజం సమస్యలకు పరిష్కారం చూపాలసిన బాధ్యత అందరిదన్నారు. ఆటిజం, ఎదుగుదల లోపం వుంటే ఎక్కడికి వెళ్ళలొ తెలియదని చెప్పారు. అటువంటి కుటుంబాలకు ఈ నయీ దిశా హెల్ప్ లైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.
ఆటిజం తో సఫర్ అయ్యే పేదలు వుంటారు..వాళ్ళని సపోర్టు చేయాలని కోరారు. దివ్యాంగులకు ప్రభుత్వం ప్రత్యేక జాబ్ పోర్టల్ ను ప్రారంబించిందని తెలిపారు. వైకల్యం వుంటే ఆత్మ న్యూనతకి లోను కావోద్దనీ, వైకల్యం వున్న కుటుంబాలకి ధైర్యం కలిగించాలని చెప్పారు. ఆ దిశలో సమాజంలో మార్పు జరగాలి, ఆలోచన తీరులో మార్పు జరగాలని కోరారు. ఇతరులను మానసికంగా వేధించే వారే వికలాంగులనీ,ఇతరుల మనసులను గాయపరచడం నిజమైన వైకల్యమన్నారు. ఆటిజం చిన్నారుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చి హక్కులను తెలుపుతుంది, పేరెంట్స్ కి మార్గం చూపు తుందన్నారు. ఈ హెల్ప్ లైన్ ను రూపొందించిన నయీ దిశా రిసోర్స్ సెంటర్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పాల్గొన్న మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకటి కరుణ, వికలాంగుల వృద్ధుల సాధికార సంస్థ డైరెక్టర్ శైలజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
**