Site icon vidhaatha

Sitakka | బాధిత అంధ బాలికకు సత్వర న్యాయం … మంత్రి సీతక్క ఆదేశాలు

విధాత : మలక్ పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక దాడి ఘటనపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడిన మంత్రి సీతక్క ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, బాధితురాలికి సత్వర న్యాయం అందేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకావాలని అధికారులకు ఆదేశించారు. అన్ని రకాల సంక్షేమ హాస్టల్స్‌లో భద్రతను అధికారులు పర్యవేక్షించాలని, ఎక్కడా కూడా ఈ తరహా ఘటనలు, వేధింపులు పునరావృతం కారదని హెచ్చరించారు.

Exit mobile version