Ambati Rambabu : సీఎం చంద్రబాబుపై అంబటి తీవ్ర వ్యాఖ్యలు.. గోరంట్లలో టెన్షన్

సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యలు గోరంట్లలో ఉద్రిక్తతలకు దారి తీశాయి. అంబటి వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Ambati Rambabu

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయంగా ఉద్రిక్తతలు రేపుతున్నాయి. తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో వైసీపీ చేపట్టిన కూటమి పాప ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబటి గోరంట్లకు వచ్చారు. అంబటి రాంబాబు వాహనాన్ని టీడీపీ కూటమి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఆవేశానికి గురైన అంబటి రాంబాబు దమ్ముంటే చంద్రబాబును రమ్మంటూ బూతులతో దూషించారు. ఆయన వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులు మరింత రెచ్చిపోగా పోలీసులు జోక్యం చేసుకుని అంబటిని అక్కడి నుంచి పంపించేశారు.

గోరంట్లలో టెన్షన్

సీఎం అనికూడా చూడకుండా సీనియర్ నాయకుడన్న గౌరవం లేకుండా చంద్రబాబుపై అంబటి రాంబాబు బూతులతో విమర్శలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. వెంటనే అంబటి 24గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని..లేదా పోలీసులు అంబటిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రెండు జరుగని పక్షంలో అంబటి రాంబాబు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అంబటికి దమ్ముంటే మరోసారి గోరంట్ల సెంటర్ కి రావాలని చాలెంజ్ చేశారు. దీంతో గోరంట్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అంబటి ఇంటిపైకి వెళ్లిన టీడీపీ మహిళా కార్యకర్తలు చెప్పు చూపిస్తూ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.

అరెస్టు చేస్తారా..నేను సిద్దం : అంబటి

చంద్రబాబుపై తాను చేసిన విమర్శల నేపథ్యంలో నా అరెస్టుకు ఆదేశాలు ఇచ్చారని తెలిసిందని.. నేను అరెస్టుకు సిద్దంగా ఉన్నానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తాను చంద్రబాబుకు, లోకేష్ రెడ్ బుక్ కు, కేసులు, అరెస్టులకు భయపడే వ్యక్తికి కాదన్నారు. అరెస్టుపై ఐ డోంట్ కేర్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు సంగతి తెలుస్తానన్నారు. ఇంట్లోనే ఉంటానని అరెస్టు చేసుకోవచ్చన్నారు. నన్ను తిట్టిన వారినే నరేను తిట్టాను..మధ్యలో చంద్రబాబు పేరు వచ్చిందని, ఈ వయస్సులో నేను అలా మాట్లాడాల్సింది కాదని..నేను చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడలేదని, నన్ను తిట్టిన వారినే తిట్టే క్రమంలో మాత్రమే తీవ్ర వ్యాఖ్యలు చేశానన్నారు. అరెస్టుకు భయపడి నేను మాట్లాడటం లేదని, నా అంతరాత్మ మేరకు అలా మాట్లాడి ఉండాల్సింది కాదని నా భావన అన్నారు. దీనిపై నేను క్షమాపణలు చెప్పబోనని, చంద్రబాబును అననప్పుడు ఎవరికి క్షమాపణలు చెప్పాలని అంబటి వ్యాఖ్యానించారు.

అంబటి ఇంటిపై దాడి..ధ్వంసం

గోరంట్లలో అంబటి రాంబాబు ఇళ్లు, ఆఫీస్ పై టీడీపీ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేశారు. రాళ్లు, కోడిగుడ్లు, కర్రలతో దాడి చేసి వాహనాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో అక్కడ వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఇవి కూడా చదవండి :

Volkswagen Tayron R-Line: నేరుగా ఫార్చూనర్​నే ఢీకొట్టనున్న ఫోక్స్‌వ్యాగన్ ఎస్​యూవీ
Sweet Potato : చిలగడదుంప ఉడికించి తింటే మంచిదా..? కాల్చి తింటే మంచిదా..?

Latest News