ఆదర్శ నియోజకవర్గాలుగా కోదాడ, హుజూర్‌నగర్‌లు: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాలను, వాటిలోని మున్సిపాల్టీలను రాష్ట్రంలో ఆదర్శంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని, మౌలిక వసతల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు

  • Publish Date - July 4, 2024 / 06:31 PM IST

మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
అభివృద్ధి పనులపై సమీక్ష.. కొత్త పనులకు శంకుస్థాపనలు

విధాత : కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాలను, వాటిలోని మున్సిపాల్టీలను రాష్ట్రంలో ఆదర్శంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని, మౌలిక వసతల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయా నియోజవర్గాల్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కోదాడ మున్సిపాలిటీ మీటింగ్ హాల్‌లో జరిగిని కోదాడ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుతూ రూ.8 కోట్లతో మిని ట్యాంక్ బండ్ నిర్మాణం, రూ. 6కోట్లతో కోదాడ టౌన్ హాల్ నిర్మాణం,రూ 50లక్షలతో ఖమ్మం x రోడ్ జంక్షన్ అభివృద్ధి, రూ.1.1 కోట్లతో ముఖద్వారాలు, రూ.4.4 కోట్లతో చెర్వుకట్ట బజార్ నుండి అనంతగిరి రోడ్డు వరకు మేజర్ ఔట్ పాల్ డ్రెయిన్ నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.

అనంతగిరి మండలంలో తహశీల్దార్, ఎంపీడీవో భవనాలకు, పోలీస్ స్టేషన్ భవనాలకు శంఖుస్థాపన చేశారు. అనంతరం తన హుజూర్ నగర్ నియోజకవర్గంలోని రామ స్వామి గుట్ట వద్ద క్రిస్టియన్ స్మశాన వాటిక పనుల పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేళ్లచెర్వు లో రూ కోటి 50 లక్షలతో ముస్లిం కమ్యూనిటీ హాల్‌కు, రూ. 55 లక్షలతో మేళ్లచెర్వు శివాలయం రాజ గోపురం శంఖుస్థాపన చేశారు. హుజూర్ నగర్ లో మినీ స్టేడియం స్థల పరిశీలన చేసి, పాలకవీడులో తహశీల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్ భవనాలకు శంఖుస్థాపన చేశారు. హూజూర్‌నగర్‌, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో టీయూఎఫ్‌ఐటీసీ పనులపై సమీక్ష చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి వెంట స్థానిక నాయకులు, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.

Latest News