బీఆరెస్ ఆఫీస్ నిర్మాణంపై మంత్రి వెంకట్‌రెడ్డి దుష్ప్రచారం .. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

ల్లగొండలో బీఆరెస్ ఆఫీస్ నిర్మాణం అక్రమమైందంటూ మంత్రి కోమటిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులతో, నిబంధనల మేరకు డబ్బు చెల్లించి బీఆరెస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం చేశామన్నారు

  • Publish Date - July 2, 2024 / 04:35 PM IST

విధాత : హైదరాబాద్: నల్లగొండలో బీఆరెస్ ఆఫీస్ నిర్మాణం అక్రమమైందంటూ మంత్రి కోమటిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులతో, నిబంధనల మేరకు డబ్బు చెల్లించి బీఆరెస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం చేశామన్నారు. మిగతా పార్టీల ఆఫీసులకు ఇచ్చినట్లుగానే బీఆరెస్ పార్టీకి కూడా భూ కేటాయింపు చేశారని గుర్తు చేశారు. నల్లగొండలో 100కోట్లకు ఎకరం పలికే భూమి ఎక్కడ ఉందో మంత్రికే తెలియాలని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూమిలో కాంగ్రెస్ ఆఫీసు కట్టుకుని ప్రారంభించుకోలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీదని, పక్క పార్టీల మీద పడి ఏడ్వడం ఎందుకని సెటైర్లు వేశారు. బీఆరెస్ పార్టీ ఆఫీస్ కుల్చివేయాలంటూ మంత్రి వెంకట్‌రెడ్డి చెప్పడాన్ని బీఆరెస్ తీవ్రంగా ఖండిస్తుందని, దీనిపై అన్ని రకాలుగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తే ప్రజల చేతిలో గుణ పాఠం తప్పదన్నారు.

Latest News