MLA Naini Rajender Reddy | రుణమాఫీ నిర్ణయం చారిత్రాత్మకం: ఎమ్మెల్యే నాయిని

రైతులకు 2 లక్షలు రుణమాఫీ ఏకకాలంలో చేయాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు

  • Publish Date - June 23, 2024 / 04:53 PM IST

విధాత, వరంగల్ ప్రతినిధి: రైతులకు 2 లక్షలు రుణమాఫీ ఏకకాలంలో చేయాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమమార్క చిత్రపటాలకు ఆదివారం క్షీరాభిషేకం చేశారు.

ఏకకాలంలో రుణమాఫీ చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించారని అన్నారు. గత బీఆరెఎస్ ప్రభుత్వం ఒక లక్ష రూపాయలను 6 విడుతలుగా చేశారని, కేసీఆర్ కేవలం 11, 930 కోట్ల మాత్రమే చేశారని అన్నారు. పదేళ్ళ బీఆరెఎస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసిందని విమర్శించారు. రుణ‌మాఫిపై మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం చాల సంతోషకరమని అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధంగా ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డిసిసి అద్యక్షురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, టిపిసిసి కార్యదర్శి ఈ.వి. శ్రీనివాస్ రావు, కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, సయ్యద్ విజయ శ్రీ రజాలి, మామిండ్ల రాజు, చీకటి శారద ఆనంద్, నసీం జాహన్, వీరగంటి రవీందర్, నలుబోల సతీష్, నాయిని లక్ష్మా రెడ్డి, మొహమ్మద్ అంకుష్, సయ్యద్ రజాలి, డాక్టర్ రామకృష్ణ, బంక సరళ సంపత్ యాదవ్, ఏం.వి. సమతా రాజు, గుంటి స్వప్న, కొంటె సుకన్య, లహరి, నల్ల సత్యనారాయణ, కట్ట రఘుపాల్ రెడ్డి, తౌటం రవీందర్, సయ్యద్ అజ్గర్, మొహమ్మద్ సమాద్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Latest News