మృతుల కుటుంబాల‌కు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ప‌రామ‌ర్శ‌

విధాత, మెదక్ బ్యూరో: పట్టణంలో శనివారం ఉదయం విధుల్లో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న సీఎం కెసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వారి ఇళ్ల‌కు వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించారు. వారి పార్థివ దేహాలకు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. అనంత‌రం ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికులు మరణించిన […]

  • Publish Date - December 24, 2022 / 01:55 PM IST

విధాత, మెదక్ బ్యూరో: పట్టణంలో శనివారం ఉదయం విధుల్లో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న సీఎం కెసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వారి ఇళ్ల‌కు వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించారు. వారి పార్థివ దేహాలకు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. అనంత‌రం ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికులు మరణించిన విషయం బాధాక‌ర‌మ‌ని వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.

ప్రమాదంలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం ద్వారా మున్సిపల్ శాఖ ద్వారా ఆర్థిక సహాయం అందే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి హామీనిచ్చారు. ఎమ్మెల్సీతో పాటు స్థానిక కౌన్సిలర్లు రాజలింగం, ఒడ్డి వసంత రాజులు, మాజీ కౌన్సిలర్లు రాజు, ఐతారం నర్సిం ఉన్నారు.