Cyclone Montha : తెలంగాణపైకి దూసుకొస్తున్న ‘మొంథా’ తుపాన్

ఏపీని వణికించిన ‘మొంథా’ తుపాన్ ఇప్పుడు తెలంగాణపైకి దూసుకొస్తోంది. రాత్రికి భారీ వర్షాలు, అలర్ట్లు ప్రకటించిన వాతావరణ శాఖ.

Montha Cyclone Head towards telangana

విధాత, హైదరాబాద్ : ఏపీని వణికించిన ‘మొంథా’ తుపాన్ అనూహ్యంగా దిశ మార్చుకుని తెలంగాణపైకి దూసుకొస్తుంది. అర్ధరాత్రి నర్సాపురం వద్ద తీరం దాటిన మొంథా తుపాన్ తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడుతున్న క్రమంలో అనూహ్యంగా దిశ మార్చుకుని అల్పపీడనంగా మారి తెలంగాణ రాష్ట్రంపైకి దూసుకొస్తుంది. వాయువ్యదిశగా ప్రయాణించి వచ్చే ఆరు గంటల్లో అల్పపీడనంగా మారనున్న మొంథా తుపాన్ ప్రభావంతో తెలంగాణలో 24గంటల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి.

ఇప్పటికే ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. తీరం దాటాక దిశ మార్చుకున్న మొంథా తుఫాన్ బలహీనపడి భద్రాచలంకు 50 కిలోమీటర్లు..ఖమ్మంకు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. వచ్చే ఆరు గంటల్లో అల్పపీడనంగా ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో 12జిల్లాలకు ఆరేంజ్, 9జిల్లాలకు ఎల్లో అలర్ట్, 3జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకంటించారు. ఇప్పటికే యాద్రాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురులో 9సెంటిమీటర్ల వర్షం పడింది. రాష్ట్రంలోని నదులు, వాగులు పొంగిపోర్లుతున్నాయ. హైదరాబాద్ నగరంలో వర్షం దంచి కొడుతుంది. ఖమ్మం, పాలేరు, భద్రాచలం, సత్తుపల్లిలో భారీ వర్షం పడుతుంది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ చెరువును తలపిస్తుంది. రైల్వేస్టేషన్‌లో రైలు పట్టాలపై వరద నీరు చేరి పట్టాలు మునిగిపోవడంతో డోర్నకల్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు.

జంట జలాశయాల గేట్లు తెరిచిన జలమండలి అధికారులు

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉదృతి పెరుగడంతో జల మండలి అధికారులు ఉస్మాన్‌సాగర్‌(గండిపేట) పది గేట్లను రెండు అడుగుల మేర, హిమాయత్‌సాగర్‌ నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మంచిరేవుల కల్వర్టుపై నుంచి వరద నీరు పారుతుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. హిమాయత్‌సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 1762.25 అడుగులు, ఉస్మాన్‌సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 1788.85 అడుగులుగా ఉంది. జంట జలశయాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు భారీ వర్షాలు వరదలతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది.