హైద­రా­బా­ద్‌ నగరానికి చెత్త సమస్య తీరినట్టే! ఇక మరిన్ని డంప్ యార్డులు

హైద­రా­బాద్ చుట్టూ నాలు­గు­వై­పులా నాలుగు డంప్ యార్డు­లను జనా­వా­సా­లకు దూరంగా ఏర్పాటు చేయా­లని ముఖ్య­మంత్రి ఏ రేవంత్ రెడ్డి అధి­కా­రు­లకు సూచిం­చారు

  • Publish Date - January 6, 2024 / 02:58 PM IST
  • జనా­వా­సా­లకు దూరంగా ఏర్పాటు
  • ప్రజా­రో­గ్యా­నికి ఇబ్బంది లేకుండా చర్యలు
  • ముఖ్య­మంత్రి రేవం­త్‌­రెడ్డి ఆదే­శాలు
  • మెట్రో అలైన్‌మెంట్‌పై మరోసారి స్పష్టత

విధాత, హైద­రా­బాద్‌: హైద­రా­బాద్ చుట్టూ నాలు­గు­వై­పులా నాలుగు డంప్ యార్డు­లను జనా­వా­సా­లకు దూరంగా ఏర్పాటు చేయా­లని ముఖ్య­మంత్రి ఏ రేవంత్ రెడ్డి అధి­కా­రు­లకు సూచిం­చారు. ఈ డంప్ యార్డుల వల్ల ప్రజల ఆరో­గ్యా­నికి ఎలాంటి ఇబ్బం­దులు తలె­త్త­కుండా తగిన చర్యలు తీసు­కో­వా­ల­న్నారు. ప్రస్తుతం హైద­రా­బాద్ నగ­రా­ని­కం­త­టికీ జవ­హర్ నగ­ర్‌లో ఒకే డంప్ యార్డు ఉన్నది. ప్రతి­రోజూ సుమారు 8 వేల టన్నుల చెత్తను ఇక్కడి డంప్ యార్డుకు చేర­వే­స్తు­న్నారు. డంప్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం, చెడు­వా­సన చుట్టు ప్రక్కల ప్రజ­లకు ఇబ్బం­ది­క­రంగా మారింది.


కాలు­ష్యాన్ని తగ్గించే విధంగా సిటీకి దూరంగా గతంలో శంషా­బాద్, మెదక్ వైపు డంప్ యార్డు సైట్‌­లను పరి­శీ­లిం­చా­మని అధి­కా­రులు ముఖ్య­మంత్రి దృష్టికి తీసు­కొ­చ్చారు. వాటిని పరి­శీ­లించి ప్రజ­లకు ఇబ్బం­ది­క­రంగా లేకుండా ఏర్పాటు చేయా­లని సీఎం ఆదే­శిం­చారు. చెత్త ద్వారా 15 మెగా­వాట్ల విద్యు­త్తును ఉత్పత్తి చేయ­వ­చ్చని, ఇందుకు గాను టీఎ­స్ఎ­స్పీ­డీ­సీ­ఎ­ల్‌తో సమ­న్వయం చేసు­కో­వా­లని ముఖ్య­మంత్రి సూచిం­చారు. చెత్తను సాధ్య­మై­నం­త­వ­రకు రీసై­కిల్ చేయా­ల­న్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహ­కా­రా­లం­ది­స్తా­మ­న్నారు.

మెట్రో రైల్

సీఐఐ ప్రతి­ని­ధుల సమా­వే­శంలో మెట్రో రైల్ రూట్ విస్త­ర­ణపై జరి­గిన చర్చలో ముఖ్య­మంత్రి రేవంత్ రెడ్డి మరో­మారు స్పష్ట­తను ఇచ్చారు. గతంలో గచ్చి­బౌలి – ఎయిర్ పోర్టు వరకు 32 కిలో­మీ­టర్ల మేర ప్రణా­ళి­కలు రూపొం­దిం­చా­రని, దాని­వల్ల సామాన్య జనా­లకు పెద్దగా ఉప­యోగం లేదని అన్నారు. గచ్చి­బౌలి, జూబ్లీ­హిల్స్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో అధి­కంగా ధని­కులు వుండటం వల్ల వారు ఎక్కు­వగా స్వంత వాహ­నాలు వాడు­తు­న్నా­రని పేర్కొ­న్నారు. గతంలో సర్వే చేసిన గౌలి­గూడ – ఫల­క్‌­నుమా – ఎయిర్ పోర్టు రూట్, ఎల్బీ నగర్ నుంచి ఎయిర్ పోర్టు రూట్‌ను ప్రజలు ఎక్కు­వగా విని­యో­గిం­చు­కు­నేం­దుకు అవ­కా­శాలు ఉన్నా­యని చెప్పారు. ఈ ప్రాంతాల నుంచి అరబ్ దేశా­లకు అధి­కంగా వెళు­తుం­టా­రని, విదే­శా­లకు వెళ్లే వారి కుటుం­బాలు ఎయిర్ పోర్టుకు వెళ్లి సెండాఫ్ ఇస్తుం­టా­రని, అందుకే ఈ రూట్ చాలా విని­యో­గ­క­రంగా వుంటుం­దని సీఎం అభి­ప్రా­య­ప­డ్డారు.

మూసీ పరి­వా­హక ప్రాంత అభి­వృ­ద్ధికి కట్టు­బడి ఉన్నాం

మూసీ నది పరి­వా­హక ప్రాంతాన్ని తొలి­ద­శలో 55 కిలో­మీ­టర్ల మేర అభి­వృద్ధి చేయా­లని ప్రభుత్వం సంక­ల్పిం­చింది. రింగ్ రోడ్ టూ రింగ్ రోడ్ మొత్తం ప్రాంతా­లను అభి­వృద్ధి చేసేం­దుకు ప్రభుత్వం కృత నిశ్చ­యంతో ఉందని ముఖ్య­మంత్రి రేవం­త్‌­రెడ్డి తెలి­పారు. మూసీ పరి­వా­హక ప్రాంతాల్లో ఐకా­నిక్ డిజై­న్ల­లతో అమ్యూ­జ్‌­మెంట్‌ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజి­నెస్ ఏరియా, షాపింగ్ మాల్స్‌ అంత­ర్జా­తీయ స్థాయిలో ఏర్పాటు చేయా­ల­న్నారు.


మూసీ పరి­వా­హక ప్రాంతా­ల్లోని చారి­త్రా­త్మక కట్ట­డా­ల­యిన చార్మి­నార్, గోల్కొండ, సెవెన్ టూంబ్స్, తారా­మతి బారా­దరి వంటి వాటిని అన­సం­ధా­నిస్తూ ఒక టూరిజం సర్క్యూ­ట్‌ను రూపొం­దిం­చా­లని సూచిం­చారు. ఈ ప్రాంతాల్లో పెట్టు­బ­డులు పెట్టేం­దుకు పీపీపీ మోడ­ల్‌లో పారి­శ్రా­మి­క­వే­త్త­లను ఆహ్వా­ని­స్తు­న్నా­మ­న్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయం ఆహ్లా­ద­క­రంగా గడి­పేం­దుకు సౌక­ర్యాలు కల్పిం­చేం­దుకు పరి­శీ­లిం­చా­ల­న్నారు. మూసీ పరి­వా­హక ప్రాంతంలో చెక్ డ్యాములు నిర్మించి వాటర్ ఫౌంటెన్స్, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయా­లని సూచిం­చారు. ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పా­టుకు ప్రభుత్వం సహ­కారం అంది­స్తుం­దని చెప్పారు.