రాజాసింగ్ వ్యాఖ్యలపై ఈటల రియాక్షన్
విధాత : బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు త్వరలో కొత్త అధ్యక్షుడి నియామకం జరుగనున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతల మధ్య వాడివేడి మాటల మంటలు రేగుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ అగ్రెసీవ్‌గా పోరాడే..దేశం పట్ల..ధర్మం పట్ల అవగాహాన ఉన్న వ్యక్తిని, అందరిని కలుపుకునే పోయే నాయకుడిని పార్టీ నూతన అధ్యక్షుడిగా నియామించాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కౌంటర్ అన్నట్లుగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌ళో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలంటున్నారని ఏ పైటర్ కావాలి..స్ట్రీట్ ఫైటర్ కావాలంటూ రిప్లై ఇచ్చారు.
ఐదుగురు ముఖ్యమంత్రులతో తాను కొట్లాడానని, సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే.. దమ్మున్నోడు కావాలని.. గల్లీల్లో కొట్లాడేవాళ్లు కాదన్నారు. నా లాంటి వాళ్లు ఊరికే మాట్లాడరని.. సందర్భం వచ్చినప్పుడు జేజెమ్మలతో కొట్లాడేటోల్లమని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కూడా కొట్లాడతానన్నారు. బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకానికి ముందు ఎమ్మెల్యే రాజాసింగ్..ఎంపీ ఈటల మధ్య సాగిన మాటల యుద్దం పార్టీలో నెలకొన్న విబేధాలకు నిదర్శనమా లేక ఈటల నాయకత్వానికి రాజాసింగ్ సానుకూలంగా లేరా అన్న రచ్చ పార్టీ శ్రేణుల్లో జోరందుకుంది.