Illegal Nursing Colleges : నర్సింగ్ కళాశాలల అక్రమాలపై చర్యలు తీసుకోండి: ఎన్ హెచ్ ఆర్ సీ ఆదేశాలు

నర్సింగ్ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్..! నాలుగు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని డీఎంఈ, రిజిస్టార్‌లకు ఆదేశాలు.

Nursing Colleges

విధాత, హైదరాబాద్ : నర్సింగ్ కళాశాలల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘం డీఎంఈ డైరెక్టర్, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టార్ లను ఆదేశించించి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ కళాశాలల అక్రమాలపై తరచుగా వస్తున్న పత్రిక కథనాలను ఆధారంగా చేసుకొని హైదరాబాద్ కు చెందిన న్యాయవాది సామాజికవేత్త కారుపోతుల రేవంత్ జాతీయ మానవ హక్కుల సంఘంను ఆశ్రయించారు. నర్సింగ్ కళాశాలలో సరైనా వసతులు, అధ్యాపకులు లేకుండానే.. మధ్యవర్తుల ద్వారా అక్రమంగా అధికారులకు లక్షల రూపాయల లంచాలు ఇచ్చి అనుమతులు తెచ్చుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకుండా మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.

ఒకచోట పర్మిషన్ తీసుకొని మరొకచోట కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు ఒకే బిల్డింగ్ లో 8 కళాశాలలను ఏర్పాటుకు అనుమతించడం లాంటి సంఘటనలను ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన నర్సింగ్ కళాశాలలకు కేవలం షోకాజ్ నోటీసులు మాత్రమే జారీ చేసి చేతులు దులుపుకుంటుందని..దీంతో నర్సింగ్ కళాశాలల మోసాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి పూర్తి విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని విద్యార్థులకు విద్యా హక్కు ప్రకారం నాణ్యమైన విద్యను అందించే విధంగా చొరవ తీసుకోవాలని న్యాయవాది రేవంత్ తన ఫిర్యాదులో కోరారు.

ఈ ఫిర్యాదు పై విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల సంఘం విద్యార్థుల విద్యా హక్కులకు భంగం కలిగిస్తున్న ఈ సంఘటనపై డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కు, రిజిస్టార్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ కు తక్షణమే విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.అనుమతి లేని కళాశాలలు, ఆక్రమాలకు పాల్పడుతున్న అధికారులపైన, మధ్యవర్తులపైన, భాగస్వాములైన అందరిపైప తక్షణమే చర్యలు తీసుకోవడంతో… ఏం చర్యలు తీసుకున్నారన్న దానిపై నివేదికను నాలుగు వారాల్లోపు జాతీయ మానవ హక్కుల సంఘానికి నివేదించాలని ఆదేశాలు జారీ చేసింది.