Chevella Bus Accident | చేవెళ్ల బస్సు ప్రమాదంపై మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు

చేవెళ్ల బస్సు ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు నమోదు చేసింది. రవాణా, హోం, హైవే అధికారులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Chevella bus accident human rights commission

విధాత, హైదరాబాద్ : చేవెళ్ల బస్సు ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు నమోదు చేసింది. ఈ ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని.. రవాణా, హోం, గనులు,భూగర్భశాస్త్రం, నేషనల్ హైవే ఆథార్టీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీజీఆర్టీసీ శాఖలకు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 15వ తేదీన ఉదయం 11 గంటలలోపు నివేదికను సమర్పించాల్సిందిగా.. ఆయా శాఖల్ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.

చేవెళ్ల మీర్జాగూడ వద్ధ ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీకొన్న ఘటనలో 20మంది మృతి చెందారు. ఈ ఘటన బస్సు ప్రయాణికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవడం, టిప్పర్ అతివేగం ప్రమాదానికి దారితీశాయి. ప్రమాదం తర్వాత రోడ్డు విస్తరణ కోసం స్థానికులు వరుస ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని మంగళవారం ఆందోళనకారులు ఘెరావ్ చేశారు.