విధాత, హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రతిపక్ష బీఆరెస్ సభ్యులను మాట్లాడినివ్వకుండా చేసున్న సీఎం రేవంత్‌రెడ్డి సబితక్కనే చూసి వణికిపోతున్నాడని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సభ నుంచి వాకౌట్ చేసి, పోలీసులతో బలవంతంగా తెలంగాణ భవన్‌కు తరలించబడిన బీఆరెస్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సభకు రావాలని మాట్లాడుతున్న కాంగ్రెస్ లిల్లిపుట్లకు దమ్ముంటే కేసీఆర్ తరుపున సబితక్కకు రెండు నిమిషాల సమయం మాట్లాడేందుకు ఇవ్వాలన్నారు. సబితక్కకు రెండు నిమిషాలు సమయం ఇవ్వడానికి వణికి పోతున్న మీకు కేసీఆర్ దేనికి రా అంటూ మండిపడ్డారు. సబిత మైక్ అడిగితే రూల్స్ మాట్లాడుతూ పిరికిపందల్లా చర్చకు పారిపోతున్నారన్నారు. ఊర కుక్కల్లాగా సబితక్క పైన, తెలంగాణ మహిళాలోకంపైన సభలో ఎట్లా విరుచుకుపడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తుందన్నారు. నీవు గతంలో తుపాకులు పట్టి తిరిగిండొచ్చు కాని ఈరోజు సీఎంగా ఉన్నావని గర్తు పెట్టుకోవాలన్నారు. ఈ రోజు ఫ్రజలు అల్పబుద్ధివారికి అధికారమిచ్చిన అనే వేమన శతకాన్ని గుర్తు చేసుకుంటున్నాన్నారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూనేను సమయమడిగితే రూల్స్ చెబుతున్నారని, మరి ఆదివాసీ మహిళయైన మా ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఎస్సీ వర్గీకరణ మీద రెండు నిమిషాలు మాట్లాడుతానంటే కూడా మైక్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ మా మహిళా శాసన సభ్యులను కన్నీళ్లు పెట్టించినందుకు నీకు తగిన శాస్తి త్వరలోనే జరుగుతుందని హెచ్చరించారు.
G. Jagadish Reddy | సబితక్కనే చూసి వణికి పోతున్నారు..మీకు కేసీఆర్ ఎందుకు మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విసుర్లు
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రతిపక్ష బీఆరెస్ సభ్యులను మాట్లాడినివ్వకుండా చేసున్న సీఎం రేవంత్‌రెడ్డి సబితక్కనే చూసి వణికిపోతున్నాడని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Latest News
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల
లోక్‌సభలో ఏడు కీలక బిల్లులకు సిద్ధమైన కేంద్రం
భారత్ లో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు!
తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం
ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!
పసికందు వద్దకు పాము..నెమలికి ఆహారం..వైరల్
ఈవిడ ఆవిడేనా…నటి నమిత వీడియో వైరల్
కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ఒంటరి ఏనుగు పట్టివేత..బాధిత గ్రామాలకు ఊరట