Power Supply | హైదరాబాద్ : హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్. నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. దీంతో అంతకు ముందే ఆయా ప్రాంతాల ప్రజలు తమ పనులు ముగించుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు.
పేట్‌బషీరాబాద్ సబ్‌స్టేషన్ పరిధిలో సబ్ స్టేషన్ నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. సెయింట్ ఆన్స్ స్కూల్ ఫీడర్, ఫెయిర్ మాంట్ ఫీడర్ల పరిధిలోని ఎన్‌సీఎల్ కాలనీ, పర్విత ఆస్పత్రి, హైటెన్షన్ రోడ్డు ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని పేర్కొన్నారు. దీంతో వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఏఈ జ్ఞానేశ్వర్ కోరారు.
