ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి
పాఠశాలలో స్కావెంజర్స్ ను నియమించాలి
ప్రాథమిక పాఠశాలలకు హెచ్.ఎం పోస్ట్ లు మంజూరు చేసి పదోన్నతులు కల్పించాలి
—- విధాత, వరంగల్ ప్రతినిధి : ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు విద్యావాలంటీర్లను నియమించి బదిలీ అయిన ఎస్జీటీ లను అందరినీ వెంటనే రిలీవ్ చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించి, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరారు.
పి.యస్ హెచ్.ఎం పోస్టులు, నాలుగు డి.ఏలు మంజూరు చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని, సిపియస్ విధానం రద్దు చేయాలని ఆయన కోరారు.
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం జిల్లా అధ్యక్షులు జి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన హనుమకొండలో జరిగింది. ప్రధాన కార్యదర్శి పూజారి మనోజ్ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. ముఖ్య అతిధిగా హాజరైన వరంగల్ జిల్లా నిర్మాణ బాధ్యులు, రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ సమావేశం లో మాట్లాడుతూ ఉద్యోగులు , ఉపాధ్యాయుల అనేక సమస్యల పరిష్కారిస్తామని ముఖ్య మంత్రి ప్రకటించారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇంకా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కోరారు. ఇటీవల జరిగిన పదోన్నతులలో బి.యి.డి. అర్హత కలిగిన ఎస్జీటీలు ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. పి.యస్ హెచ్.ఎం పోస్ట్ లు పదివేలకు పెంచి బి.యి.డి. అర్హత కలిగిన ఎస్జీటీ లకు కూడా పదోన్నతులకు అవకాశం కల్పించాలని కోరారు. బదిలీలు పొందిన ఎస్జీటీ ఉపాధ్యాయులందరినీ రిలీవ్ చేయాలన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని(సీపీఎస్) రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్(ఓపీఎస్ )ని కొనసాగించేందుకు చర్యలు చేపట్టాలని, పెండింగ్లో ఉన్న 4 కరువు భత్యం (డిఏ)లు విడుదల చేయాలని ,పిఆర్సి కమిటీ రిపోర్టును తెప్పించుకొని సాధ్యమైనంత త్వరలో పిఆర్సి ప్రకటించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి మనోజ్ ఉపాధ్యక్షలు జె. స్వామి, ఎంకె తన్వీర్, బుచ్చాచారీ, ఉటుకూరి అశోక్, పూర్ణచందర్, రమేష్, పాటి రవి, పి. మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.