ప్రేమ జంట ఫిర్యాదుపై నిర్లక్ష్యం.. సీఐ, ఎస్ఐలపై చర్యలు

ఉప్పల్ భగాయత్ లే అవుట్లో వచ్చే జంటలను బెదిరిస్తు బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యల విషయంలో ఓ ప్రేమజంట ఇచ్చిన ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించి పోకిరిలతోనే కాంప్రమైజ్ కావాలంటూ సూచించిన వ్యవహారంపై ఉప్పల్ సీఐ, ఎస్‌ఐలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు

  • Publish Date - June 23, 2024 / 04:36 PM IST

నాగోల్ సీఐ బదిలీ.. ఎస్‌ఐ, ఏఎస్‌ఐల సస్పెండ్‌

విధాత : ఉప్పల్ భగాయత్ లే అవుట్లో వచ్చే జంటలను బెదిరిస్తు బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యల విషయంలో ఓ ప్రేమజంట ఇచ్చిన ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించి పోకిరిలతోనే కాంప్రమైజ్ కావాలంటూ సూచించిన వ్యవహారంపై ఉప్పల్ సీఐ, ఎస్‌ఐలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఉప్పల్ సీఐ ఎలక్షన్‌రెడ్డిపై బదిలీ వేటు వేసి సీపీ కార్యాలయానికి అటాచ్ చేసి, ఎస్‌ఐ శంకర్‌ను డీసీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ రాచకొండ సీపీ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు.

బాధిత ప్రేమజంట తమను పోకిరిలు బెదిరించి 3లక్షలు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికి న్యాయం చేయాల్సిన ఎస్‌ఐ శంకర్ పోకిరిలతో కుమ్మక్కవ్వడంతో బాధిత జంట ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ జరిపి ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, విధినిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్‌ఐలపై చర్యలు తీసుకున్నారు. అలాగే మేడిపల్లి ఎస్‌ఐపై బదిలీ వేటు వేసినట్లుగా సమాచారం. మరో కేసులో నాగోల్ ఇన్‌స్పెక్టర్ పరుశరామ్‌పై బదిలీ వేటు వేయగా, ఎస్‌ఐ మధు, ఏఎస్‌ఐ అంజయ్యలను సస్పెండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయకుండా బాధితుడిని బెదిరించారన్న ఆరోపణలపై వారిపై చర్యలు తీసుకున్నారు.

Latest News