మిగతా పిల్లలు ఎక్కడా.. అసలు తల్లిదండ్రులు ఎవరూ

చిన్నారుల విక్రయం కేసులో రాచకొండ కమిషనరేట్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు అరెస్టు చేసిన అంతరాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠా సభ్యులను విచారిస్తున్న క్రమంలో ఇప్పటిదాకా ఈ ముఠా ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి

  • Publish Date - May 29, 2024 / 01:20 PM IST

వారిని కొనుగోలు చేసి తెచ్చారా
కిడ్నాప్ చేశారా
పిల్లల విక్రయం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

విధాత: చిన్నారుల విక్రయం కేసులో రాచకొండ కమిషనరేట్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు అరెస్టు చేసిన అంతరాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠా సభ్యులను విచారిస్తున్న క్రమంలో ఇప్పటిదాకా ఈ ముఠా ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్మకాలు సాగించిందని ఇప్పటిదాకా ఇలా మూడేళ్లుగా 50మంది చిన్నారులను ముఠా అమ్మేసినట్లుగా గుర్తించారు. వీరిలో 16 మంది పిల్లలను గుర్తించిన పోలీసులు మిగతా పిల్లలు ఎక్కడున్నారన్నదానితో పాటు అసలు ఆ పిల్లలు ఎవరికి సంబంధించిన వారన్నదానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగా పోలీస్ బృందాలు ఢిల్లీకి వెళ్లి ముఠా సభ్యుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఢిల్లీకి చెందిన కిరణ్‌, ప్రీతి, పూణేకు చెందిన కన్నయ్యలు చిన్నారుల సరఫరాలో కీలకంగా ఉన్నారు. వీరు తమ నగరాల్లో పిల్లల్ని సేకరిస్తారు. వీరు పిల్లలను ఎక్కడి నుంచి ఏలా తెస్తున్నారన్నది తేలాల్సివుంది. వారు పేద తల్లిదండ్రుల వద్ద పిల్లలను కొనుగోలు చేస్తున్నారా లేక కిడ్నాప్‌లు చేసి ఇక్కడి ముఠా సభ్యులకు సరఫరా చేస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ ముగ్గురు ఓక్కో చిన్నారికి 1లక్ష వరకు కమిషన్ తీసుకుని పిల్లలను సరఫరా చేస్తున్నారు.

ఇప్పటి వరకు హైదరాబాద్ ముఠాకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేయగా.. వీరంతా ఏజెంట్లుగా పని చేసినట్టు గుర్తించడం జరిగింది. అరెస్ట్ అయిన వారిలో శోభా రాణి , హేమలత , సలీం , చేతన్, పద్మ, సరోజ, శారద, రాజు, అనురాధ, మమత, ముంతాజ్‌ ఉన్నారు. మరోవైపు అక్రమ పద్దతిలో ముఠా నుంచి పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రుల నుంచి గుర్తించి వారి నుంచి 16 మంది చిన్నారులను పోలీసులు స్వాధీనం చేసుకుని శిశువిహార్‌కు తరలించారు. తల్లిదండ్రుల్లో 9మంది తెలంగాణకు చెందిన వారు కాగా, ఏడుగురు ఏపీకి చెందిన వారున్నారు.

Latest News