Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో ఎండలు( Sun Stroke ) దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 21, 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం( Weather Department ) తెలిపింది. ఈ నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్( Yellow Alert ) జారీ చేసింది.
మే 22వ తేదీన నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రాజధాని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మే 23వ తేదీన భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది.
రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ టీ బాలాజీ కూడా చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతాయని తెలిపారు. రాష్ట్రంలో పలు చోట్ల 100 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇక మే 21 నుంచి 36 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.