Site icon vidhaatha

మళ్లీ ఉద్యోగంలోకి లచ్చిరెడ్డి

 విధాత‌: డిప్యూటీ కలెక్టర్, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి తిరిగి ఉద్యోగంలో చేరారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ను కలిసి లచ్చిరెడ్డి రిపోర్ట్ చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కాలంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కీసర ఆర్డీవోగా ఉన్న లచ్చిరెడ్డిపై బదిలీ వేటు వేసింది. అంతటితో ఆగకుండా కక్ష్య పూరితంగా వ్యవహరించడంతో సుమారు నాలుగు ఏళ్ళుగా విధులకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

Exit mobile version