Site icon vidhaatha

Naveen Mittal | భూభారతి చట్టం చరిత్రాత్మకం

Naveen Mittal |

హైద‌రాబాద్, ఏప్రిల్ 28(విధాత‌): తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూ భారతి చట్టం – 2025 చరిత్రాత్మకమ‌ని సీసీఎల్ఏ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. నవీన్ మిట్టల్ సీసీఎల్ఏ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హోదాలో భూ భారతి చట్టం -2025 రూపకల్పనలో కీలక భూమిక పొషించారు. అలాగే రెవెన్యూ సర్వీసెస్ సేవలను బలోపేతం చేయడంలో ప్రధాన భూమిక పోషించిన సంగతి విదితమే.

భూ భారతి చట్టం ప్రారంభోత్సవం తర్వాత సోమవారం తొలిసారి సీసీఎల్ఏ కార్యాలయానికి వచ్చిన నవీన్ మిట్టల్ ను తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సీసీఎల్ఏ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రైతులకు, రెవెన్యూ ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలియజేశారు.

అనంతరం సీసీఎల్ఏ కార్యాలయ ఉద్యోగులకు భూ భారతి చట్టం – 2025 పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ఉద్యోగులకు చట్టం అనివార్యత, చట్టంలోని ప్రతి క్లాజ్ తో పాటు రూల్స్ పై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర కోశాధికారి మల్లేశ్, టీజీఆర్ఎస్ఏ సీసీఎల్ఏ విభాగం అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ చైతన్య, రాంబాబు , శ్రీకాంత్ రెడ్డి, సురేష్ మరియు పెద్ద సంఖ్యలో సీసీఎల్ఏ విభాగం ఉద్యోగులు పాల్గొన్నారు.

Exit mobile version