Site icon vidhaatha

భ‌ట్టీతో రేవంత్ భాయి భాయి

విధాత,హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మంగళవారం టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కలిశారు. కొన్ని రోజులుగా రేవంత్‌రెడ్డికి భట్టి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. ఉదయం మల్లు రవితో చర్చల తర్వాత రేవంత్‌ భట్టిని కలిశారు. రేపటి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని రేవంత్‌రెడ్డి కోరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వరుస భేటీలతో బిజీ బిజీ అయ్యారు. వరుసగా కాంగ్రెస్ అగ్రనాయకులను కలుస్తున్నారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క‌, జగ్గారెడ్డి, మల్లు రవి , ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి క‌లిసి టీపీసీసీ బాధ్యతల స్వీకరణకు రావాల‌ని ఆహ్వానించారు.

Exit mobile version