కేసిఆర్ దక్షతతో.. ఆర్టీసీ లాభాల బాట: గుత్తా సుఖేందర్ రెడ్డి

విధాత: నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీ సంస్థ సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతతో లాభాల బాట పట్టిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మిర్యాలగూడ డివిజన్ ఆర్ టి సి డిపో లో 21 నూతన బస్సులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తో కలిసి ప్రారంభించారు. అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ టిసి ఉద్యోగులకు గతంలో ఎలాంటి వసతులు ఉండేవి కాదని, ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఏర్పాటు […]

  • Publish Date - January 27, 2023 / 03:00 PM IST

విధాత: నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీ సంస్థ సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతతో లాభాల బాట పట్టిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మిర్యాలగూడ డివిజన్ ఆర్ టి సి డిపో లో 21 నూతన బస్సులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తో కలిసి ప్రారంభించారు.

అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ టిసి ఉద్యోగులకు గతంలో ఎలాంటి వసతులు ఉండేవి కాదని, ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ను ప్రజలకు అర్థం అయ్యేలా ప్రభుత్వం మంచి కార్యక్రమాలను చేపట్టిందన్నారు.

రాష్ట్రంలో లాభాల్లో ఉన్న డిపోల్లో మన మిర్యాలగూడ మూడో స్థానంలో ఉందన్నారు. బాగా కష్టపడి పని చేస్తున్న ఆర్. టి .సి ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఆర్ .టి .సి సంస్థ కార్గో సర్వీస్ అందించడం లో విజయవంతం అయ్యిందన్నారు.

ప్రజలు వీలైనంత వరకు సురక్షితంగా ఆర్. టి. సి బస్సుల్లో ప్రయాణించాలని సూచిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు, ఆర్ టి సి మిర్యాలగూడ డిపో ఆర్ ఏం, ఆర్ టి సి ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.