Site icon vidhaatha

Saleswaram Jatara | నేటి నుంచి సలేశ్వరం జాతర.. లింగమయ్య దర్శనానికి పోటెత్తనున్న భక్తులు

Saleswaram Jatara : తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ మూడు రోజుల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు.

నల్లమల అడవుల్లో కొండలు, కోనలు, జలపాతాల నడుమ వెలసిన లింగమయ్య దర్శనం కోసం భక్తులు సాహసయాత్రే చేయాల్సి ఉంటుంది. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలోని దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం కోసం ఏటా భక్తులు భారీగా తరలివస్తారు.

భక్తులు కిలోమీటర్ల మేర కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి వచ్చే భక్తులు రాంపూర్‌పెంట వరకు బస్సులు, కార్లలో వచ్చి అక్కడి నుంచి 5 కిలోమీటర్ల మేర దట్టమైన అడవుల్లో నడస్తూ వెళ్లాలి. జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version