Supreme Court : స్పీకర్ ప్రసాద్ కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు షాక్! కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

Supreme Court

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారంటూ బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణ క్రమంలో సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్‌ అమలు చేయలేదని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై సమాధానం చెప్పాలంటూ స్పీకర్‌కు సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ను పాడి కౌశిక్‌రెడ్డి, కేటీఆర్‌ పిటిషన్‌లతో జతచేసింది. అన్ని పిటిషన్‌లపై కలిపి విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసినట్లుగా పేర్కొంది. ఇప్పటికే 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ తీరును తప్పుబడుతూ మీరు చర్యలు తీసుకుంటారా లేక మేమే తీసుకోవాలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే చివరి అవకాశమని.. మిగిలిన అనర్హత పిటిషన్లపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టి మేటం జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి :

Health Tips : డిప్రెషన్‌తో బాధపడుతున్నారా..? ఈ సమస్యకు వ్యాయామంతో చెక్‌ పెట్టండి
Harish Rao | దుమ్ము.. దుమ్ము అయిపోతావ్ : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్

Latest News