Site icon vidhaatha

KTR | అవమానించినా ప్రశ్నించడం ఆపం..కాంగ్రెస్‌కు కేటీఆర్ స్పష్టీకరణ

విధాత, హైదరాబాద్ : పోరాటాలు బీఆరెస్‌కు కొత్తేంకాదని..బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటామని, నిలదీస్తూనే ఉంటామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్‌ ఎక్స్‌ వేదికగా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు. పోరాటం మాకు కొత్త కాదని, ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతమన్నారు. రాహుల్‌గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి నిరుద్యోగులకు ఇచ్చిన 2లక్షల హామీపై సమాధానం చెప్పాలని, బోగస్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని, మిమ్మల్ని వదిలిపెట్టమని, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం.

జై తెలంగాణ.. అంటూ తన అరెస్టుకు సంబంధించిన ఫొటోలను కేటీఆర్ ట్వీట్‌లో షేర్ చేశారు.

Exit mobile version