విధాత: శ్రీశైలం ఎడమగట్టు భూర్భజల విద్యుత్ కేంద్రం నాలుగవ యూనిట్ లో సాంకేతిక లోపంతో వ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ ఉత్పత్తి సమయంలో యూనిట్ నందు షార్ట్ సర్క్యూట్ నెలకొన్నట్లుగా ఇంజనీర్లు భావిస్తున్నారు. దసరా పండుగ రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి నాలుగవ యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ జెన్ కో ప్రారంభించింది.
విద్యుత్ ఉత్పత్తి ప్రారంబించిన 10 గంటలలోపే స్టేటార్లు మొరాయించాయి. యూనిట్ సెన్సార్లు పనిచేయకపోవడంతో ఇంజనీర్లు అయోమయంలో పడ్డారు. నాలుగవ యూనిట్ సాంకేతిక లోపాన్ని తెలంగాణ జెన్కో అధికారులు గోప్యంగా ఉంచారు. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో తెలంగాణ జెన్ కోకు కోట్లలో నష్టం వాటిల్లినట్లుగా సమాచారం.
Srisailam Power Plant : శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రం నాలుగవ యూనిట్‌లో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో తెలంగాణ జెన్కోకు కోట్లలో నష్టం వాటిల్లినట్లు సమాచారం.
