విధాత : బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్న 52మంది అభ్యర్థులతో తొలి జాబితా వెల్లడించింది. ఇందులో మహిళలకు 12 సీట్లు కేటాయించారు. తొలి జాబితాలో ఎంపీలు బండి సంజయ్, అర్వింద్‌కుమార్, సోయం బాపురావులకు టికెట్లు ఇచ్చారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌లకు టికెట్లు ఖరారు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కాగా.. వారితో పాటు కిషన్‌రెడ్డి, డీకె అరుణ, లక్ష్మణ్‌ల పేర్లు కూడా తొలి జాబితాలో లేవు. బహుశా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు పోటీకి దూరంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈటల రాజేందర్‌కు హుజురాబాద్ టికెట్‌తో పాటు సీఎం కేసీఆర్‌ను ఢీ కొట్టేందుకు గజ్వేల్ టికెట్‌ను కూడా కేటాయించారు. గోషామహల్ సీటును ళ్లీ రాజాసింగ్‌కే కేటాయించారు. జాబితా వెల్లడికి ముందే రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్‌ను బీజేపీ అధిష్టానం ఎత్తివేసింది.
The Central Election Committee of the Bharatiya Janata Party has decided the following names for the ensuing General Elections to the Legislative Assembly of Telangana. pic.twitter.com/dnadYpuiYa
— BJP (@BJP4India) October 22, 2023
ప్రకటించిన పేర్లలో సిర్పూర్ అభ్యర్థిగా పాల్వాయి హరీష్ బాబు, బెల్లంపల్లి(ఎస్సీ) అమరాజుల శ్రీదేవి, కాన్పూర్(ఎస్టీ) రమేష్ రాథోడ్, అదిలాబాద్ పాయల్ శంకర్, బోథ్ (ఎస్టీ) సోయం బాపూరావు, నిర్మల్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ రామారావు పటేల్, ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి, జుక్కల్(ఎస్సీ) టీ. అరుణతార, కామారెడ్డి కె. వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ అర్బన్ ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త, బాల్కొండ అన్నపూర్ణమ్మ ఏలేటి, కోరుట్ల ధర్మపురి అరవింద్, జగిత్యాల బోగ శ్రావణి, ధర్మపురి( ఎస్సీ) ఎస్. కుమార్, రామగుండం కందుల సంధ్యారాణి, కరీంనగర్ బండి సంజయ్ కుమార్, చొప్పదండి(ఎస్సీ), బొడిగె శోభ, సిరిసిల్ల రాణి రుద్రమ రెడ్డి, మానకొండూరు(ఎస్సీ), ఆరేపల్లి మోహన్, హుజురాబాద్ ఈటల రాజేందర్, నర్సాపూర్ ఎర్రగోళ్ల మురళి యాదవ్, పటాన్ చెర్వు టీ. నందీశ్వర్ గౌడ్, దుబ్బాకకు మాధవనేని రఘునందన్ రావు, గజ్వెల్ ఈటల రాజేందర్, కుత్బుల్లాపూర్ కూన శ్రీశైలం గౌడ్, ఇబ్రహీంపట్నం నోముల దయానంద్ గౌడ్, మహేశ్వరం అందెల శ్రీరాములు యాదవ్, ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డి, కార్వాన్ అమర్ సింగ్, గోషామహల్ టి. రాజాసింగ్, చార్మినార్ మేఘారాణి, చాంద్రాయణగుట్ట సత్యనారాయణ ముదిరాజ్, యాకుత్‌పురా వీరేందర్ యాదవ్, బహుదూర్‌పురా వై. నరేష్ కుమార్, కల్వకుర్తి తల్లోజు ఆచారి, కొల్లాపూర్ ఎల్లనేని సుధాకర్ రావు, నాగార్జునసాగర్ కంకణాల నివేదితారెడ్డి, సూర్యాపేట సంకినేని వెంకటేశ్వరరావు, భువనగిరి గూడూరు నారాయణరెడ్డి, తుంగతుర్తి(ఎస్సీ) కడియం రామచంద్రయ్య, జనగామ ఆరుట్ల దశ్మంత్ రెడ్డి, ఘనపూర్ స్టేషన్(ఎస్సీ) గుండె విజయ రామారావు, పాలకుర్తి లేగ రామ్మోహన్ రెడ్డి, డోర్నకల్(ఎస్టీ) భూక్య సంగీత, మహబూబాద్(ఎస్టీ) జటోత్ హుస్సేన్ నాయక్, వరంగల్ వెస్ట్ రావు పద్మ, వరంగల్ ఈస్ట్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వర్ధన్నపేట(ఎస్సీ) కొండేటి శ్రీధర్, భూపాలపల్లి చందుపట్ల కీర్తి రెడ్డి, ఇల్లందు(ఎస్టీ) రవీంద్ర నాయక్, భద్రాచలం(ఎస్టీ) కుంజా ధర్మారావులను ఎంపిక చేశారు.