Check Power : బిగ్ బ్రేకింగ్..ఉప సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు

తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఉప సర్పంచ్‌లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పంచాయతీ నిధుల విత్‌డ్రాలో ఉప సర్పంచ్‌లకు ఉన్న జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

revokes check power of sub sarpanch

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కొత్త ఉప సర్పంచ్ లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ ఉండటంతో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ఉప సర్పంచ్ పదవులకు భారీ డిమాండ్ ఏర్పడింది. పంచాయతీ నిధులు, బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్, సెక్రటరీతోపాటు ఉప సర్పంచ్‌‌కు కూడా ‘జాయింట్ చెక్ పవర్’ ఉండటంతో ఈ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. సర్పంచ్ పదవి కోసం రిజర్వేషన్లు కలిసిరాని చోట ఆశావహులు వార్డు మెంబర్​గా పోటీ చేసి.. గెలిచి, ఉప సర్పంచ్​ పదవి దక్కించుకోవడంతో పోటీ పడ్డారు.

గతంలో ఉప సర్పంచ్​లకు చెక్​ పవర్​ రద్దు చేయాలంటూ సర్పంచ్​లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. గత ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థులు సర్పంచ్‌‌గా గెలిచిన తర్వాత చెక్ పవర్ విషయంలో ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ముందుగానే జాగ్రత్త పడ్డారు. ఈ గొడవ అంతా ఎందుకనుకుందో ఏమో గాని కాంగ్రెస్ ప్రభుత్వం ఉప సర్పంచ్ ల జాయింట్ చెక్ పవర్ రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి :

Thai Army Destroy Hindu Deity : థాయిలాండ్ లో హనుమాన్ విగ్రహం కూల్చివేత..భారత్ లో వ్యతిరేకత
Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులో మంచు లక్ష్మీ, రీతూ, సన్నీల విచారణ

Latest News