hydra । హైదరాబాద్‌లో హైడ్రా దూకుడుకు చెరువుల పక్కన అపార్ట్‌మెంట్లు కొనగోలు చేసినవారు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి మార్గదర్శకాలు జారీ చేశారు. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పారు. ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు.