First Mobile Phone Call | ఇండియా( India )లో మొబైల్ ఫోన్ కాల్స్( Mobile Phone Calls ) ఎవరు మాట్లాడి ఉండొచ్చు. ఒక వేళ మాట్లాడితే.. గొప్ప వ్యక్తులే అయి ఉండాలి. ఎందుకంటే.. దేశంలో తొలిసారిగా మొబైల్ ఫోన్ కాల్స్( First Mobile Phone Call ) ప్రారంభిస్తున్నారంటే.. దేశంలో అత్యున్నత పదవులు అలంకరించిన వారి చేతనే ప్రారంభించి ఉండాలి. అది కూడా దేశ ప్రధానో, లేక టెలీ కమ్యూనికేషన్ మంత్రైనా అయి ఉండాలి. కానీ వీరిద్దరూ కాదు. మరి ఎవరు మాట్లాడి ఉంటారని మీకు సందేహం రావొచ్చు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి( Chief Minister ) మొదటి మొబైల్ ఫోన్ కాల్( First Mobile Phone Call ) మాట్లాడి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆ ముఖ్యమంత్రి ఎవరో కాదు.. పశ్చిమ బెంగాల్( West Bengal )ను 23 ఏండ్ల పాటు ఏలిన జ్యోతిబసు( Jyoti Basu ).
సరిగ్గా 30 ఏండ్ల క్రితం.. అంటే జులై 31, 1995న బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు( Jyoti Basu ) ఈ దేశంలోనే మొదటిసారిగా మొబైల్ ఫోన్ కాల్ మాట్లాడి చరిత్ర సృష్టించారు. నోకియా హ్యాండ్‌సెట్( Nokia Handset ) ద్వారా కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి సుఖ్‌రామ్(ukh Ram)కు బెంగాల్ నుంచి ఢిల్లీకి జ్యోతి బసు మొబైల్ ఫోన్ కాల్ చేశారు. అప్పట్నుంచి డిజిటల్ కమ్యూనికేషన్( Digital Communication )కు ఈ దేశం నాంది పలికింది. 1995లో జ్యోతిబసు కాల్ చేసిన సర్వీస్ ప్రొవైడర్ మోదీ టెల్‌స్ట్రా(Modi Telstra network ).. (ఇది బీకే మోడీ( BK Modi ), ఆస్ట్రేలియాకు చెందిన టెల్‌స్ట్రా జాయింట్ వెంచర్).
అప్పట్లో ఫోన్ కాల్ కాస్ట్ ఎంత..?
30 ఏండ్ల క్రితం మొబైల్ ఫోన్ చాలా కాస్ట్‌లీగా ఉండేది. 1995లో నిమిషానికి 8 రూపాయాల 4 పైసలు చార్జీ పడేది. పీక్ అవర్స్‌లో అయితే మొదట్లో 16 రూపాయాల 8 పైసలు ఛార్జీ పడేది. ఇన్‌కమింగ్ కాల్స్‌కు కూడా నాడు చార్జీలు వసూలు చేసేవారు. ఇప్పుడు అంటారా..? మొబైల్ కాల్స్ ఉచితంగా లభిస్తున్నాయి. అంతే కాదు ఒక జీబీ డేటా రూ. 4కు కూడా దొరుకుతోంది. అంటే మొబైల్ కాల్స్, డేటా ఎంత చౌకగా మారాయో అర్థమవుతుంది దీన్ని బట్టి.