Fee Reimbursement | ఫీజు రీయంబర్స్ మెంట్ పై అధ్యయన కమిటీ : తెలంగాణ సర్కార్ ఆదేశాలు

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పాలసీపై అధ్యయన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని జీవోలో పేర్కొంది.

Fee Reimbursement

విధాత, హైదరాబాద్ : తెలంగాణ కాలేజీల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులు, మార్పులకు సంబంధించి ప్రభుత్వం అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల ఫీజు రీయింబర్స్ మెంట్ పై కమిటీని ఏర్పాటు చేయాలని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం 16మందితో కమిటీని ఏర్పాటు ఏర్పాటు చేసింది. గత నెల 28న ఇచ్చిన జీవోను ప్రభుత్వం తాజాగా బయటపెట్టడం గమనార్హం.

కమిటీ చైర్మన్ గా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీనియామితులయ్యారు. కమిటీలో ప్రొఫెసర్‌ కోదండరాం, కంచ ఐలయ్య, ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌తో పాటు ఉన్నత విద్యాసంస్థల నుంచి ముగ్గురు ప్రతినిధులను కమిటీలో సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.

ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పాలసీపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేక ట్రస్ట్‌ ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సాధ్యాసాధ్యాలను కమిటీ పరిశీలించనుంది. 3 నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. విద్యా సంస్థలు పేర్కొన్న సూచనలపై కూడా కమిటీ అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.