Site icon vidhaatha

తెలంగాణ ఇంటర్‌ విద్యా సంవత్సరం ఖరారు..

విధాత‌: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ విద్యా సంవత్సరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆన్‌లైన్‌ తరగతులతో కలిపి 220 పని దినాలతో విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. దసరాకు ఆదివారంతో కలిపి 5 రోజులు, సంక్రాంతికి జనవరి 13 నుంచి 15 వరకు సెలువులు ప్రకటించింది. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ విధానంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. అర్ధ సంవత్సర, ప్రి ఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

ముఖ్యమైన తేదీలు..

డిసెంబర్‌ 13 నుంచి 18 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు.
ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రి ఫైనల్‌ పరీక్షలు.
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్.
మార్చి 23 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు.
మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు.
ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు.
జూన్ 1న ఇంటర్ కళాశాలలు పునఃప్రారంభం

Exit mobile version