Konda Surekha | అందుకు చింతిస్తున్నా..! అర్థరాత్రి మంత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్..!!

Konda Surekha | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ( Konda Surekha ) మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి సంచ‌ల‌న ట్వీట్ చేశారు. గతంలో అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ), అతని కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్న‌ట్లు కొండా సురేఖ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Konda Surekha | హైద‌రాబాద్ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ( Konda Surekha ) మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి సంచ‌ల‌న ట్వీట్ చేశారు. గతంలో అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ), అతని కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్న‌ట్లు కొండా సురేఖ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

నాగార్జున, ఆయ‌న కుటుంబాన్ని బాధ పెట్టాల‌నే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌న్నారు. వారిని ఇబ్బంది పెట్టాల‌ని కాని, వారి ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగించాల‌న్న‌ది కాని త‌న ఉద్దేశం కాద‌ని స్ప‌ష్టం చేశారు. నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్య‌ల్లో ఏదైనా పొర‌పాటు ఉంటే అందుకు చింతిస్తున్నాన‌ని, త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్నాన‌ని కొండా సురేఖ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి 12 గంట‌లు దాటిన త‌ర్వాత కొండా సురేఖ చేసిన ఈ ట్వీట్ చ‌ర్చానీయాంశంగా మారింది. సురేఖ‌పై నాగార్జున దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం కేసు నాంప‌ల్లి కోర్టులో కొన‌సాగుతోంది.