Konda Surekha : వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో మళ్లీ రచ్చ..మంత్రి కొండా హాట్ కామెంట్స్

వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో మళ్లీ రాజకీయ రచ్చ మొదలైంది. అనుచరుల వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేస్తూ ప్రత్యర్థులపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Konda Surekha

విధాత: వరంగల్ తూర్పు నియోజకవర్గం రాజకీయాలపై మంత్రి కొండా సురేఖ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. గత కొన్ని రోజులుగా కొండా అనుచరులను ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తనవైపు తిప్పుకుంటున్నారన్న అంశంపై కొండా సురేఖ పరోక్షంగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పది మంది గ్రూప్ ను వెనకేసుకుని సంతోషపడుతున్నారని, వాళ్ల ఆనందాన్ని మేము అడ్డుకోవట్లేదు అని సురేఖ వ్యాఖ్యానించారు. బలహీనులే బలవంతుల వెనక పడతారని, కొండా దంపతులు బలవంతులు అని, మమ్మల్ని ఢీకొనడం చేతకాక మా వెనక గోతులు తవ్వుతున్నారన్నారు. ఎవరు తీసిన గొయ్యిలో వాళ్లే పడతారన్నారు.

ఎవరిపై నేను అధిష్టానానికి ఫిర్యాదు చేసేది లేదు అని, చిల్లర వాళ్లపై నేను కామెంట్ చేయబోనని చెప్పారు. భవిష్యత్తులో పార్టీ వివాదాలపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అని మంత్రి కొండా సురేఖ తెలిపారు. నేను నియోజవర్గానికి తరుచూ వచ్చిన రాకపోయినప్పటికి..ఇక్కడి అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మాత్రం లోటు లేదని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

IDPL Land Encroachment : కవిత ఎఫెక్ట్..ఐడీపీఎల్ భూములపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు
Nitish Kumar| వివాదస్పదమైన బీహార్ సీఎం నితీష్ కుమార్ చర్య

Latest News